టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా హ్యూజ్ ఫాలోయింగ్ సంపాదించుకొని ఐకాన్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. ఇక పుష్ప సినిమా తరువాత నార్త్ ఇండియాలో కూడా బన్నీ సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు.ఇక అంతలా పుష్ప సినిమా బన్నీ గ్రాఫ్‌ని పెంచింది. సిగ్నేచర్ స్టెప్పులు, పాటలు ఇంకా డైలాగ్స్.. ఇలా ప్రతి ఎలిమెంట్ కూడా సోషల్ మీడియా ద్వారా జనాల్లోకి వెళ్లిపోయింది. పుష్పరాజ్‌ పాత్రలో బన్నీ ఊర మాస్‌ యాక్టింగ్‌కి ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అంటే అమ్మాయిలు కూడా పడి చచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో బన్నీ మేనియా బాగా నడుస్తుంది.  19.9 మిలియన్ల మంది ఇన్ స్టాలో అల్లు అర్జున్‌ని ఫాలో అవుతున్నారు నెటిజన్స్. 20 మిలియన్ ఫాలోయర్స్ కి ఇంకొక అడుగు దూరంలో బన్నీ ఉన్నాడు.


 ఇక మరి బన్నీ ఫాలో అయ్యేది ఎవర్నో మీకు తెలుసా.,.?ఐకాన్ స్టార్ ఓన్లీ ఓకే ఒక పర్సన్‌ను మాత్రమే తన ఇన్స్టాలో ఫాలో అవుతున్నారు. ఆమె  ఎవరో కాదు తన అర్థాంగి స్నేహ రెడ్డి. ఈ విషయాన్ని చాలామంది కూడా గుర్తించి ఉండరు. స్నేహ రెడ్డిని కూడా ఇన్ స్టాలో భారీగా ఏకంగా 8.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. చాలామంది స్టార్ హీరోయిన్స్ కంటే కూడా ఆమెకు ఫాలోవర్స్ ఎక్కువ. ఎప్పుడూ కూడా హీరోయిన్స్ కి తగ్గకుండా స్టన్నింగ్‌ లుక్స్‌తో అదరగొడుతూ ఉంటారు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డి. ఏవైనా ఫెస్టివల్స్, ఫంక్షన్స్ ఉంటే.. ఆ వేడుకల్లో.. శారీలో మెరిస్తూ చాలా అందంగా కనిపిస్తారు.ఇక వెకేషన్స్‌కు వెళ్లినప్పుడు ట్రెండీ డ్రస్సెస్‌ ని స్నేహ ధరిస్తారు. స్నేహారెడ్డి ఏ కాస్టూమ్‌లో అయినా కూడా చాలా గ్లామరస్‌గా ఉంటారని..హీరోయిన్స్‌కు ఏ మాత్రం తీసిపోరంటూ కామెంట్స్‌ పెడుతుంటారు బన్నీ ఫ్యాన్స్. ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే..  సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పుష్ప: ది రూల్ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: