టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న ఈ అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2 చాలా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు వచ్చేసి తమ వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.రీసెంట్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా మొదటిసారి టాక్ షోకు విచ్చేసి చాలా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. కొద్దిరోజులుగా డిజిటల్ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్న ఫస్ట్ ఎపిసోడ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ ఎపిసోడ్ సెకండ్ పార్ట్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎంతగానో చూస్తున్నారు. ఇక ఈ లాస్ట్ ఎపిసోడ్ ఈరోజు రాత్రి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ఆహా పవర్ స్టార్ ఎపిసోడ్ కు సంబంధించి ఓ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది.అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోపాటు ఇంకా డైరెక్టర్ క్రిష్ కూడా ఎంట్రీ ఇచ్చారు.


 ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో హరి హర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతుంది. తాజాగా విడుదలైన వీడియోలో పవన్ కళ్యాణ్ ను.. బాలయ్యను కొన్ని సరదా ప్రశ్నలతో ఆటపట్టించాడు డైరెక్టర్ క్రిష్. అయితే ఆయన అడిగే ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ నవ్వుతూనే సమాధానాలు చెప్పేశారు.అలాగే ఇందులో పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితానికి సంబంధించిన పలు అంశాలు కూడా  బయటపెట్టినట్లుగా సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్పెషల్ గ్లింప్స్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా పార్ట్ 2 ఎపిసోడ్ ముందుగా ప్రకటించిన దానికంటే కూడా ఒకరోజు ముందే అనగా ఫిబ్రవరి 9న ప్రసారం చేయనున్నారు. ఈ పార్ట్ 2 నేడు రాత్రి 9 గంటల నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవ్వనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: