తాజాగా సౌత్ ఇండియా సినిమా అనౌన్స్ అయ్యి ఇప్పటికే భారీ బజ్ అందుకున్న చిత్రం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా తమిళ్ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న లియో సినిమా అని చెప్పవచ్చు. దర్శకుడు లోకేష్ కనకరాజు దర్శకత్వంలో సాలిడ్ ఫిక్షన్ డ్రామాగా.. తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఒక సినిమా కావడంపై ఈ సినిమాపై సెన్సేషనల్ హైపు తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు . ఇదిలా ఉండగా ఈ సినిమాకి లోకేష్ కణగరాజు ఒక సెన్సేషనల్ కాస్టింగ్ కూడా పట్టుకున్నాడని తెలుస్తోంది..

ఇక్కడ మరొకవైపు 14 సంవత్సరాల తర్వాత విజయ్ తో స్టార్ హీరోయిన్ త్రిష హీరోయిన్ గా పిక్స్ కావడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.  అయితే ఈ సినిమా షూటింగు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో త్రిష అస్వస్థకు గురైనట్టు సినీ వర్గాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే రీసెంట్గా లియో సినిమా యూనిట్ అంతా కాశ్మీర్ కి పయనమైన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్లో చలి తీవ్రత మూలంగా ఆమె చాలా ఇబ్బందికి లోనైందట.  అందుకే అక్కడ ఉండలేక తీవ్ర జ్వరానికి కూడా ఆమె గురి అవడంతో వెంటనే అక్కడి నుండి వచ్చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే ఈ షెడ్యూల్లో ఆమె సీన్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసిందని అందుకే ఆమె ఇంటికి వచ్చేసింది అంటూ కూడా సినీవర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి.  ఇకపోతే ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. మరొకవైపు ఈ సినిమాకి కార్తీక్ ఖైదీ సినిమాకి లింకు ఉండవచ్చని పలు రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. వారిసు సినిమా తర్వాత విజయ్ నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి.  మరి వారి సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచిన విజయ్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు అనేది కూడా అభిమానులలో ఆసక్తిగా మారింది. మొత్తానికైతే దాదాపు 14 సంవత్సరాల తర్వాత జతకట్టనున్న ఈ కాంబినేషన్ తప్పకుండా సక్సెస్ అవుతుందని వార్త కూడా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: