నందమూరి ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లోకి వచ్చిన హీరో తారకరత్న అప్పట్లో పలు సినిమాలతో హిట్ కొట్టాడు.. కానీ వరుస ఫ్లాప్స్ రావడంతో పూర్తిగా తగ్గించేసి గత కొంతకాలం నుంచి రాజకీయాలపై దృష్టి పెట్టాడు. ఇందులో భాగంగానే టిడిపి యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో భాగంగా తారకరత్న స్పృహ తప్పి పడిపోవడం వెంటనే వైద్యులు ఆయనకు గుండెపోటు వచ్చిందని చెప్పడం అన్నీ జరిగిపోయాయి. ఆ తర్వాత ఆయనకు మెరుగైన వైద్య చికిత్స అందించడానికి నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు తరలించిన విషయం తెలిసిందే. ఇకపోతే తారకరత్న బెడ్ పై గత మూడు వారాలుగా స్పృహలోకి రాకుండా అలాగే ఉన్నారు. ఈ విషయం తెలిసే అభిమానుల సైతం కలవర చెందుతున్నారు.


ఇలాంటి సమయంలో బాలకృష్ణ తారకరత్న ఆరోగ్య విషయంపై సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది బాలయ్య సొంత కొడుకు లాగా కంటికి రెప్పల తారకరత్నను కాపాడుకుంటున్నారు.  ప్రస్తుతం తారకరత్న కోసం బాలయ్య చేసిన పనికి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.. అసలు విషయం  ఏమిటంటే తారకరత్న అస్వస్థకు గురైన దగ్గర నుంచి బాలయ్య దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు ఆయనకు వైద్యానికి కావాల్సినవన్నీ స్వయంగా సమకూర్చున్నారు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి చిత్రం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కూడా ఆగిపోయిందని సమాచారం .. తారకరత్న ఆరోగ్యం నేపథ్యంలో తన మానసిక పరిస్థితి ఏమి బాగాలేదని అందుకే ఇలాంటి సమయంలో తాను షూటింగ్ కి హాజరు కాలేదని బాలయ్య చెప్పినట్లు తెలుస్తోంది.

తారకరత్న పూర్తిగా కోలుకునే వరకు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న బాలయ్య 108 సినిమాకు బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం.. ఈ విషయం తెలిసిన నందమూరి అభిమానులు బాలయ్య పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తారక రత్న పట్ల బాబాయిగా బాలయ్య చూపిస్తున్న మద్దతు ,ప్రేమ చూసి ఇదే కదా నిజమైన రక్తసంబంధం అంటే  అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా సినిమా షూటింగ్  ఆగిపోయిందన్న బాధ ఉన్నప్పటికీ తారకరత్న పై ఆయన చూపిస్తున్న బాధ్యత ప్రేమ అందరికీ ఆనందాన్ని కలిగిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: