మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎందరో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.ఇక వారిలో వరుణ్ తేజ్ కూడా ఒకరు. మెగా హీరోల్లో ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉన్నాడు అంటే అది వరుణ్ తేజ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మూడుపదుల వయసు ఉన్న ఈ యంగ్ హీరో ఇప్పటికి పెళ్లి చేసుకోలేదు. దాంతో తరచూ ఏదో ఒక వార్తలో నిలుస్తూనే ఉంటాడు వరుణ్ తేజ్. అంతే కాదు ఎంతో కాలంగా ఆయన మీద రకరకాల ఎఫైర్  రూమర్స్ కూడా ఉన్నాయి. గతంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నాడని జోరుగా ప్రచారం జరిగిన సంగతి చాలామందికి తెలిసిందే.  ఎంతో కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారు అన్న కథనాలు సైతం అప్పట్లో వినబడ్డాయి. కానీ అలా వారిద్దరిపై రూమర్లు రావడంతో ఆ వార్తలను ఖండించింది లావణ్య. 

ఇందులో భాగంగానే అప్పట్లో తాను మాట్లాడుతూ అవన్నీ ఉట్టి అపోహలే అని మా మధ్య స్నేహం తప్ప మరి ఏమి లేదు అని పెళ్లి ప్రేమ అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని స్పష్టం చేసింది లావణ్య. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నాగబాబు వరుణ్ తేజ్ కి పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. అంతేకాదు ఒకటి రెండు సందర్భాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశాడు నాగబాబు. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా వరుణ్ తేజ్ అందరికీ ఊహించని షాక్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోని తన లవర్ ని కూడా పరిచయం చేశాడు. ఈ వార్త విని అందరూ లవర్ అంటే అమ్మాయి అని అనుకున్నారు. కానీ అందరూ అనుకున్నట్టు వరుణ్ తేజ్ ప్రేమించేది అమ్మాయిని కాదు. జిమ్ ని. ఈ నేపథ్యంలోనే వరుణ్ వ్యాయామషాల ఫోటోను షేర్ చేసి హ్యాపీ వాలెంటైన్స్ డే అని ఒక క్యాప్షన్ కూడా జోడించాడు.

ఇక ఆ పోస్ట్ కి క్యాప్షన్ గా నాకు అత్యంత ప్రియమైన మరియు ప్రేమించే ప్రదేశం జిమ్ ని ప్రేమికుల రోజు తన లవ్ ని పరోక్షంగా తెలియజేశాడు వరుణ్. ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన పోస్ట్ కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఇక వరుణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన గరుడవేగ ఫెమ్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో గాండీవ దారి అర్జున అని సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకుంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రానందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సెలవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాలో వరుణ్ ఎప్పుడు కనిపించిన విధంగా చాలా డిఫరెంట్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాతో మరో డిఫరెంట్ కాన్సెప్ట్ ని వరుణ్ ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: