నేటితరం హీరోయిన్లలో అందాలు వలకబోసి అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్గా ఎదిగిన వారే చాలామంది కనిపిస్తారు. అదేంటి నేటి రోజుల్లో ఇండస్ట్రీలో అందాల ఆరబోతకు దూరంగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసే హీరోయిన్లు లేరా అంటే ఉన్నారు. కానీ వారిని కేవలం వేళ్ళ మీద మాత్రమే లెక్క పెట్టవచ్చు. ఇక ఇలా అందాల ఆరబోతకు దూరంగా కేవలం వైవిధ్యమైన పాత్రలు మాత్రమే చేస్తూ ఇక స్టార్ హీరోయిన్గా ఎదిగిన వారిలో సాయి పల్లవి మొదటి వరుసలో ఉంటుంది అని చెప్పాలి. అవకాశాలు వచ్చిన రాకపోయినా ఈ హీరోయిన్ మాత్రం తన పంతా వదలడం లేదు.


 ఎన్ని కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చిన కూడా అటు సాయి పల్లవి మాత్రం గ్లామర్ పాత్రలు చేసే ప్రసక్తే లేదు అంటూ నిర్మాతల ముఖం మీద చెప్పేస్తుంది అని చెప్పాలి. ఇక లాస్ట్ ఇయర్ లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో వరుసగా హిట్లు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆ తర్వాత సాయి పల్లవి ఏ సినిమాలో కనిపించలేదు. దీంతో సాయి పల్లవి ఇక సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందంటూ ఎన్నో వార్తలు హల్చల్ చేశాయి. గ్లామర్ పాత్రలు చేసేందుకు ఒప్పుకోకపోవడంతో దర్శక నిర్మాతలు కూడా సాయి పల్లవిని పక్కన పెట్టేశారు అంటూ కొన్ని వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేశాయి.


 అయితే ఇలాంటి వార్తల నేపథ్యంలో ఇక ఇప్పుడు సాయి పల్లవి అభిమానులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అందింది. ప్రస్తుతం సాయి పల్లవి ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అన్నది తెలుస్తుంది. మలయాళ హీరో నవీన్ పౌళితో సినిమాకు ఓకే చెప్పేసిందట. గతంలో వీరి కాంబినేషన్లో ప్రేమమ్ సినిమా వచ్చి పెద్ద హిట్ అయింది. ఇక వీళ్లిద్దరు జోడికి ఇప్పటికీ ఊహించిన రీతిలో క్రేజీ ఉంది. ఇక వీరి కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు వివేక్ రంజిత్ స్క్రిప్ట్ రాయగా.. ఇక వినయ్ గోవిందు డైరెక్టర్గా ఒక సినిమా చేయబోతున్నారట. ఇక తమిళ స్టార్ హీరో అజిత్ సినిమాలో కూడా సాయి పల్లవి హీరోయిన్గా ఎంపికైందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: