టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ఇక ఈ సినిమా ఈరోజు విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. ఇక ఈ సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ పూర్తిగా ట్విస్టుల మయం. సహజంగా కథలో ట్విస్టులనేవి ఉంటాయి. కానీ ఇది మాత్రం ట్విస్టులే కథగా సాగే సినిమా. హీరో విష్ణు క్యారెక్టర్ ను దేశం ఇంకా ధర్మం కోసం అన్నట్టుగా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు రాసుకున్నాడు. దానికి తగ్గట్టుగా అతను కథను మలుచుకున్నాడు. అందులో ప్రతి సీన్ లో కూడా ఓ ట్విస్ట్ ఉండేట్టుగా చూసుకున్నాడు. కానీ ఈ ట్విస్టులను అర్థం చేసుకుని కథను ముందుకు తీసుకెళ్లడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది.కానీ తెర మీద సీన్స్ చాలా ఎంగేజింగ్ గా ఉన్నాయి. విష్ణు జీవిత ప్రారంభం కొంచం సాదాసీదాగా అనిపించినా, మురళీశర్మ ఎంట్రీతో థియేటర్ లో ఎంటర్టైన్మెంట్ మొదలవుతుంది.


అతన్ని అయితే డైరెక్టర్ పూర్తిగా వాడేసుకున్నాడు. మురళీ శర్మలోని అన్ని కోణాలను డైరెక్టర్ ఆవిష్కరించేశాడు. శత్రువులకు కూడా సాయం చేసే గుణం ఉన్న విష్ణు పాత్రను చాలా చక్కగా మలిచాడు. దాంతో ప్రతి ఒక్కరూ కూడా ఆ క్యారెక్టర్ తో కనెక్ట్ అవుతారు. ఎవరైనా ఇలా కదా ఉండాల్సింది అనిపించేలా కిరణ్‌ అబ్బవరం పాత్రను తీర్చిదిద్దాడు. ఇక ఈ మూవీ టీజర్ లో చెప్పినట్టు లవ్ స్టోరీగా మొదలై కామెడీతో సాగి, క్రైమ్ ఎలిమెంట్స్ యాడ్ అయ్యి, సస్పెన్స్ తో నడిచే ఇంటెన్స్ యాక్షన్ సినిమా. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రేక్షకులు కోరుకునే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో పక్కాగా ఉంటుంది. ఆ విషయంలో మాత్రం ఎలాంటి డోకా లేదు.సో హాయిగా ఫ్యామిలీ తో కలిసి ఈ సినిమాని చూసేయొచ్చు. ఫ్రెండ్స్ తో కలిసి ఈ సినిమాని చూసి బాగానే ఎంజాయ్ చెయ్యొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: