యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ గ్లోబల్ స్టార్ ధనుష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'సార్'.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల అయ్యింది.

 తమిళ్ హీరో ధనుష్ తెలుగులో డైరెక్ట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.. మరి తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ధనుష్ కు తెలుగు ప్రేక్షకులు కూడా గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు.

తమిళ్ లో వాతి పేరుతో విడుదల అయినా ఈ సినిమాలో సంయుక్త మీనన్ ధనుష్ సరసన హీరోయిన్ గా నటించగా.. జివి ప్రకాష్ సంగీతం అందించాడట... వెంకీ అట్లూరి మొదటి మూడు సినిమాలు కూడా ప్రేమ కథలను తెరకెక్కించిన వెంకీ ఈసారి మాత్రం రూటు మార్చి సోషల్ ఎలిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు అయితే వచ్చాడు.. దీంతో ఈ విషయం కూడా ధనుష్ కు చాలా బాగా కలిసొచ్చింది. ఎందుకంటే ఎప్పటిలా ప్రేమ కథనే తెరకెక్కించి ఉంటే ఈయనకు ఆశించిన విజయం అయితే దక్కేది కాదు.. కానీ ఈసారి మాత్రం వెంకీ అట్లూరి కొత్త జోనర్ లో సినిమా చేసి మంచి హిట్ ను అయితే అందుకున్నాడు.. ఈ సినిమా ప్రీమియర్స్ నుండే అదిరిపోయే రెస్పాన్స్ ను సంపాదించింది.. ఇక ధనుష్ కెరీర్ లోనే బెస్ట్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో నమోదు అవుతున్నాయి.. ఈ సినిమా రెండు రోజుల్లోనే ఏకంగా 10 కోట్లకి పైగానే గ్రాస్ ని అందుకున్నట్టు లెక్కలు కూడా చెబుతున్నాయి.. అంతేకాదు మొదటి రోజు కన్నా రెండవ రోజు ఈ సినిమా మరింతగా వసూళ్లను రాబట్టిందని సమాచారం... మూడవ రోజు ఆదివారం కావడంతో ఈ రోజు కూడా మంచి వసూళ్లు వచ్చే అవకాశం కూడా ఉంది.. మొత్తానికి మేకర్స్ పెట్టుకున్న అంచనాలను అయితే సార్ రీచ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: