మలయాళ ముద్దుగుమ్మ భావన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గోపీచంద్ సరసన 'ఒంటరి' అనే సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది ఈ భామ. ఈ సినిమా ఆడకపోయినా హీరోయిన్ భావన మాత్రం సినిమాలో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత నితిన్ సరసన హీరో, శ్రీకాంత్ సరసన మహాత్మా.. వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. అయితే టాలీవుడ్ లో ఈ అమ్మడి కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదు. కానీ మాలీవుడ్ లో మాత్రం ఈమె స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే భావన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని కారణాలవల్ల ఈమె చాలా కాలం పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిందని అప్పట్లో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. 

తన జీవితంలో జరిగిన ఒక ఘటన తర్వాత భావన  సినిమాలకు దూరమవుతుందని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భావన మళ్లీ హీరోయిన్గా తన కెరీర్ ని ట్రాక్ పై తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత కొన్నాళ్లకు వ్యాపారవేత్త నవీన్ ని పెళ్లి చేసుకుని న్యూ లైఫ్ ని స్టార్ట్ చేసింది. అయితే ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి కంబ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా భావన టాలీవుడ్ లో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాకి సైన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఓ టాలీవుడ్ నిర్మాత హీరోయిన్ భావనతో కలిసి ఒక సెన్సేషనల్ స్టోరీ తో సినిమాకి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో జరిగిన ఒక వేశ్య జీవితాన్ని ఆధారంగా తీసుకొని ఈ సినిమా స్టోరీ ని రాయించినట్లు చెబుతున్నారు. కొన్నేళ్ల క్రితం రాష్ట్రంలో పెను సంచలనంగా మారిన ఒక అంశాన్ని సినిమా గా  రూపొందించబోతున్నారట. ఒక వేశ్య వృత్తి నుంచి పెద్ద బిజినెస్ ఉమెన్ గా ఎదిగిన ఆమె కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వేశ్య పాత్రకు భావన అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని నిర్మాత భావించడంతో ఆమెతో సంప్రదింపులు జరపగా.. దీనికి భావన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు ఆ నిర్మాత అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: