తమిళ స్టార్‌ హీరో ధనుష్ ఇప్పుడు తెలుగులో కూడా స్టార్ హీరో అయిపోయాడు.ఆయన తెలుగు, తమిళ భాషల్లో తొలిసారి చేసిన బైలింగ్వల్  మూవీ ‘సార్’. తమిళ్‌లో ‘వాతి’ పేరుతో ఈ సినిమా విడుదలయ్యింది.టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాని చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. విద్యను వ్యాపారంగా మార్చుతోన్న వారిపై ఓ సాధారణ లెక్చరర్ సాగించిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమా చాలా అద్భుతంగా తెరకెక్కింది. ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా మలయాళ బ్యూటీ భీంలా నాయక్, బింబిసారా వంటి సినిమాల్లో నటించి మెప్పించిన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. సముద్రఖని, హైపర్ ఆది ఇంకా అలాగే తనికెళ్ళ భరణి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. అక్కినేని హీరో సుమంత్ కూడా ముఖ్య పాత్రలో మెరిశాడు. జీవీ ప్రకాశ్ సంగీతంతో పాటు వెంకీ అట్లూరి రాసుకున్న డైలాగ్స్ కూడా ఈ సినిమాలో బాగా పేలాయి.


అతను ఈ సినిమాని ఒక సీనియర్ డైరెక్టర్ లాగా డైరెక్ట్ చేశాడు.ఈ సినిమా ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకెళ్తుంది. వరల్డ్ వైడ్ ఇప్పటికే రూ.80 కోట్ల దాకా కలెక్షన్స్ రాబట్టింది సార్ సినిమా. త్వరలోనే వంద కోట్ల క్లబ్బులో చేరడం ఖాయమని ధనుష్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.ఇప్పటికీ కూడా ఈ సినిమా అదరగోడుతుంది. ఈ సినిమాతో ధనుష్ తెలుగులో సూపర్ రికార్డు కొట్టాడు. అదేంటంటే తెలుగులో 30 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకున్న మరో తమిళ హీరోగా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డుని రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్, లారెన్స్ లాంటి స్టార్స్ మాత్రమే అందుకోగా వారి తరువాత ధనుష్ ఈ క్లబ్ లో చేరిన తమిళ హీరో అయ్యాడు. ఇక ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ భారీ రేటుకు ‘సార్‌ ‘ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను దక్కించుకుంది.సార్ సినిమా వసూళ్లు ఇప్పటికీ కూడా బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని బాగా చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: