కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి ధనుష్ తాజాగా సార్ అనే మూవీ.లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. వెంకి అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ లో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించగా జీ వి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా తెలుగు తో పాటు తమిళం లో కూడా విడుదల అయింది. తమిళ్ లో ఈ సినిమా వేత్తి అనే పేరుతో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా విడుదల అయ్యి 17 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 17 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.

నైజాం ఏరియాలో ఏ మూవీ కి 17 రోజుల్లో 7.53 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ లో 2.66 కోట్లు ,  యూ ఏ లో 2.69 కోట్లు , ఈస్ట్ లో 1.70 కోట్లు , వెస్ట్ లో 77 లక్షలు ,  కృష్ణ లో 1.24 కోట్లు ,  నెల్లూరు లో 69 లక్షల కలెక్షన్ లను సాధించింది. మొత్తంగా ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 17 రోజుల్లో 18.68 కోట్ల షేర్ , 35.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి ఇప్పటికే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది. ఇప్పటికి కూడా సార్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ కలెక్షన్ లు దక్కుతున్నాయి. మరి లాంగ్ రన్ లో ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇలా ఇప్పటికే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో విజయాలను అందుకున్న ధనుష్ తాజాగా సార్ మూవీ తో మరో విజయాన్ని అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: