యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఎన్టీఆర్ పోయిన సంవత్సరం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ గా తన క్రేజీ ను పెంచుకున్నాడు. ఇలా గ్లోబల్ గా తన క్రేజీ ను పెంచుకున్న ఎన్టీఆర్ తన తదుపరి మూవీ లను కూడా అదే రేంజ్ లో విడుదల చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నాడు.

అందులో భాగంగా ప్రస్తుతం ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ తో తన తదుపరి మూవీ ని చేయనున్నాడు. ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ సినిమాగా రూపొందబోతుంది. ఈ మూవీ ని పాన్ ఇండియా స్థాయికి మించి 9 భాషలలో విడుదల చేయడానికి ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో జాహ్నవి కపూర్ హీరోయిన్ గ కనిపించనుండగా ... రత్నవేలు ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా పని చేయనున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ క్రేజీ మూవీ తర్వాత ఎన్టీఆర్ ... ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు.

మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 31 వ మూవీ గా రూపొందబోతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చి చాలా రోజులు అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే రెండు మూవీ లను లైన్ లో పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకుడు అయినటు వంటి వెట్రిమరన్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు ఈ మూవీ లో ధనుష్ కూడా నటించబోతున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ వార్తల్లో పెద్దగా నిజం లేదు అని కొన్ని వార్తలు ప్రస్తుత బయటికి వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: