నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే నాని ఆఖరుగా అంటే సుందరానికి మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. పోయిన సంవత్సరం విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయం అందుకుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాని "దసరా" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి కొత్త దర్శకుడు అయినటు వంటి శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మహానటి కీర్తి సురేష్మూవీ లో నాని సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకే నాని ... కీర్తి సురేష్ కాంబినేషన్ లో నేను లోకల్ మూవీ రూపొంది మంచి విజయం అందుకుంది. అలాగే ఈ మూవీ లో వీరిద్దరి జంటకు కూడా మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి లభించాయి. అలా ఇప్పటికే మంచి జోడీగా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ మరోసారి దసరా మూవీ లో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

అలాగే ఈ సినిమాలో నాని పక్క ఊర మాస్ లుక్ లో కనిపిస్తూ ఉండడంతో ఈ మూవీ పైన ప్రేక్షకుల్లో అంచనాలు మరింత గా పెరిగిపోయాయి. ఈ మూవీ ని ఈ సంవత్సరం మార్చి 30 వ తేదీన తెలుగు , కన్నడ , హిందీ , తమిళ్ , మలయాళ భాషల్లో భారీ ఎత్తున థియేటర్ లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఒక రోజు ముందు గానే అనగా మార్చి 29 వ తేదీనే యూఎస్ఏ లో ప్రీమియర్స్ వేయనున్నారు. ఈ మూవీ యొక్క యూఎస్ఏ హక్కులను ప్రత్యంగిరా సంస్థ వారు దక్కించుకున్నారు. ఈ సినిమాను మార్చ్ 29 వ తేదీనే యూఎస్ఏ లో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: