తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎంతటి పాపులారిటీని సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దారమైన రేటింగ్స్ వస్తున్నాయి. దానికి తోడు ఈ మధ్యకాలంలో జబర్దస్త్ నిర్వాహకులు కాస్ట్ కటింగ్ పేరుతో చాలా మంది కమెడియన్స్ ని తొలగించారు. జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా పేరుందిన హైపర్ ఆది ఇప్పటికే షో నుండి తప్పుకున్నాడు. దీనికి క్యాస్ట్ కటింగ్ అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యూనరేషన్ తక్కువ ఇచ్చినా కూడా జబర్దస్త్ లో కొనసాగేందుకు ఆసక్తి చెబుతున్నారు.

అలాంటి వారిలో రాకింగ్ రాకేష్ ఒకరంటూ లేటెస్ట్గా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల సుజాతను పెళ్లి చేసుకున్న రాకింగ్ రాకేష్ చాలాకాలం సుజాతతో కలిసి కామెడీ స్కిట్స్ చేసిన విషయం తెలిసిందే. జబర్దస్త్ షో కారణంగా ఇద్దరికీ మంచి క్రేజ్ వచ్చింది. ఈ షో వల్ల బయట కూడా మరికొన్ని షోల్లో పాల్గొనే అవకాశాలు సైతం వస్తున్నాయి. అందుకే ఈ ఇద్దరూ జబర్దస్త్ లో చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొని కంటిన్యూ అవుతున్నారనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. సాధారణంగా జబర్దస్త్ కమెడియన్స్ తీసుకునే రెమ్యూనరేషన్ కంటే రాకింగ్ రాకేష్, సుజాత చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ జబర్దస్త్ కమెడియన్స్ మొత్తంలో లీస్ట్ రెమ్యూనరేషన్ మాత్రం రాకింగ్ రాకేష్ దేనని అంటున్నారు. ఇక మరి కొంతమంది అయితే జబర్దస్త్ లో కనిపిస్తే చాలు పారితోషకం ఏం అక్కర్లేదు అన్నట్లుగా కూడా చేస్తున్నారు. బయట షోల్లో ఎక్కువ పారితోషకం వస్తుందని జబర్దస్త్ ను వదిలేసిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. అందుకే చాలామంది బయట ఎక్కువ ఆఫర్స్ వస్తున్నా కూడా వాళ్ళు జబర్దస్త్ ను వదిలెందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇప్పుడున్న కమెడియన్స్ కి తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారంటే అందుకు కారణం ప్రస్తుతం ఈ కార్యక్రమానికి తక్కువ రేటింగ్స్ రావడమే అని చెప్పొచ్చు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: