టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పటికే ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ... పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికుల మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

వినరో భాగ్యము విష్ణు కథ మూవీ సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న కిరణ్ ప్రస్తుతం మీటర్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. రమేష్ కాడురి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కి శ్రీ కార్తిక్ సంగీతం అందిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. 

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి "చమక్ చమక్ పోరి" అనే మొదటి లిరికల్ వీడియో సాంగ్ ను మార్చి 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా లోని మొదటి పాట ప్రమో విడుదల సమయాన్ని తాజాగా ప్రకటించింది. ఈ మూవీ లోని చమ్మక్ చమక్ పోరి ప్రోమో సాంగ్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ ప్రోమో సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: