తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ తమిళ మూవీ లలో హీరో గా నటించి ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరి గా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ తమిళ స్టార్ హీరో వారిసు అనే మూవీ లో హీరో గా నటించాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ... నేషనల్ క్రాష్ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

శ్రీకాంత్ ఈ మూవీ లో విజయ్ కి సోదరుడి పాత్రలో నటించగా ... తమన్ ఈ క్రేజీ మూవీ కి సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క తమిళ వర్షన్ ఈ సంవత్సరం సంక్రాంతి కానుక గా జనవరి 11 వ తేదీన విడుదల అయ్యి తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయ్యని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది.

అసలు విషయం లోకి వెళితే ... వరిసు మూవీ (తమిళ వెర్షన్) 14 ఏప్రిల్ 2023న సన్ టీవీ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ కి సిద్ధం గా ఉంది. ఈ మూవీ 14 ఏప్రిల్ 2023 వ తేదీన సాయంత్రం 06:30 గంటలకు సన్ టీవీ లో ప్రసారం కానుంది. మరి ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని సాధించిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ మూవీ తెలుగు లో వారసుడు పేరుతో జనవరి 14 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: