‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని ఆస్కార్ స్థాయికి తీసుకు వెళ్ళడంతో రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగి పోతోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న జక్కన్న ఆస్కార్ సంబరాలను ముగించుకుని ఈనెల 23న తన టీమ్ తో ఇండియా తిరిగి వస్తాడని సమాచారం. తిరిగి వచ్చిన తరువాత ఇక్కడ కూడ సత్కారాలు గౌరవాలు ఉంటాయి.


ఈ హడావిడి అంత పూర్తి అవ్వడానికి ఈ నెలాఖరు వచ్చేస్తుంది. వచ్చేనెల నుండి రాజమౌళి మహేష్ తో తీయబోతున్న సినిమా కథకు సంబంధించి ఒక స్థిర నిర్ణయానికి వస్తారు అని అంటున్నారు. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు సంబంధించి కొన్ని లైన్స్ తయారు చేసినప్పటికీ అవి పూర్తిగా రాజమౌళికి సంతృప్తి కరంగా ఇంకా తయారుకాలేదు అన్న గాసిప్పులు కూడ వస్తున్నాయి.


ఇప్పుడు మహేష్ తో తీయబోతున్న జక్కన్న సినిమా పాన్ వరల్ద్ గా మారుతుందని దీనికోసం 1000 కోట్లు బడ్జెట్ పెట్టినా ఆశ్చర్యంలేదు అని అంటున్నారు. ఆఫ్రికాకు చెందిన దట్టమైన అడవులలో ఈ సినిమా షూటింగ్ చాల భాగం జరుగుతుందని టాక్. అంతేకాదు ఈ మూవీ బడ్జెట్ రీత్యా అవసరం అనుకుంటే ఈమూవీని రెండు భాగాలుగా తీయాలి అన్న ఆలోచనలు జక్కన్నకు ఉన్నాయి అంటున్నారు.


మరీ ముఖ్యంగా ఈమూవీలో విలన్ గా బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ ను ఒప్పించాలని రాజమౌళి ఆలోచన టాక్. హీరో స్థాయికి మించి విలన్ ను ఎలివేట్ చేయడం రాజమౌళి సీక్రెట్. దీనితోపాటు ఈమూవీలో కొందరు హాలీవుడ్ నటీనటులు హాలీవుడ్ టెక్నిషియన్స్ ఉండే విధంగా జక్కన్న ప్లాన్ ఉంటుంది అంటున్నారు. ఈ వార్తలు అన్నీ నిజమే అయితే మహేష్ రాజమౌళిల మూవీ 2 వేల కోట్ల కలక్షన్స్ మూవీగా మారిన ఆశ్చర్యంలేదు. అయితే ఈమూవీ వచ్చే సంవత్సరం మొదలై 2026 సమ్మర్ కు వచ్చే ఆస్కారం ఉంది. మధ్యలో అనుకోని ఇబ్బందులు సరికొత్త వైరస్ లు అడ్డుతగలకుండా ఉంటే ఏమి జరుగుతుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: