మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటు వంటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ మలయాళం లో సూపర్ హిట్ విజయం సాధించినటు వంటి ప్రేమమ్ మూవీ తో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ఫిదా మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది.

మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో సాయి పల్లవి క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగింది. దానితో ఈ ముద్దు గుమ్మకు అనేక సినిమాలలో అవకాశాలు కూడా దక్కాయి. అందులో భాగంగా సాయి పల్లవి నటించిన సినిమాలు కూడా ఎక్కువ శాతం మంచి విజయాలను సాధించడంతో ప్రస్తుతం సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికీ ఎన్నో సినిమాల్లో నటించిన సాయి పల్లవి ఏ సినిమాలో కూడా గ్లామర్ షో కు దగ్గరగా ఉండకుండా చాలా పద్ధతి గల పాత్రలో నటిస్తూ ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే అజిత్ "తునివు" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఒక క్రేజీ పాత్ర కోసం ఈ చిత్ర బృందం మొదట సాయి పల్లవి ని సంప్రదించిందట ... కాకపోతే ఇతర సినిమాలతో ఫుల్ బిజీగా ఉండడం వల్ల ఈ ముద్దు గుమ్మ ఈ సినిమాలో పాత్రను రిజెక్ట్ చేసినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: