పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయన స్టార్ పవర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ నటించిన ఏ మూవీ కైనా హిట్ ... ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా మొదటి వారం రోజుల పాటు అదిరి పోయే రేంజ్ కలెక్షన్ లు లభిస్తూ ఉంటాయి. అలాంటి స్టార్ స్టామినా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం కొత్త దర్శకులకు ... యంగ్ డైరెక్టర్ లకు అవకాశాలను ఇస్తూ వెళుతున్నాడు.

అందులో భాగంగా తాజాగా పవన్ కళ్యాణ్ యంగ్ డైరెక్టర్ అయినటు వంటి సుజిత్ దర్శకత్వంలో "ఓ జి" అనే మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా చిత్ర బృందం ప్రకటించడం ... మాత్రమే కాకుండా ఈ మూవీ నుండి ఒక పోస్టర్ ను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ డిఫరెంట్ గా ఉండడంతో పోస్టర్ విడుదల తోనే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి.


ది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ జపాన్ బ్యాక్ డ్రాప్ లో సాగనున్నట్లు ... ఈ సినిమాలో జపనీస్ అంశాలు చాలా కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా కోసం ముంబై లో జపాన్ సంబంధించిన సెట్ ను వేసి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తూ ఉండడం ... సుజిత్మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నిలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: