ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న నితిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నితిన్ ఆఖరుగా ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మాచర్ల నియోజకవర్గం మూవీ తో ప్రేక్షకులను పలకరించి బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నితిన్ ... వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

శ్రీ లీల ఈ మూవీ లో నితిన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ నితిన్ కెరియర్ లో 32 వ రూపొందుతుంది. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న నితిన్ ఈ మూవీ తర్వాత ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో రూపొందబోయే మూవీ లవ్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను ఈ చిత్రం బృందం ఈ ఉగాది కి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ తో పాటు నితిన్ మరో క్రేజీ మూవీ ని కూడా ఇప్పటికే లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తనకు భీష్మ మూవీ తో సూపర్ హిట్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో మూవీ లో నితిన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన నితిన్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 30 వ తేదీన చిత్ర బృందం విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా ప్రస్తుతం నితిన్ ఒక మూవీ సెట్స్ పై ఉండగానే మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టుకొని ఫుల్ జోష్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: