తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి నేచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ కి కొత్త దర్శకుడు అయినటువంటి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా ... ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను ఎంత గానో అలరించిన కీర్తి సురేష్మూవీ లో నాని సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.

 మూవీ ని ఈ నెల 30 వ తేదీన తెలుగు తో పాటు హిందీ , తమిళ్ , కన్నడ , మలయాళం భాషలో భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి కొన్ని పాటలను మరియు కొన్ని ప్రచార చిత్రాలను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పాటలను విడుదల చేయగా ఆ పాటలలో నుండి చమ్కీల అంగీలేసి అనే పల్లవి తో సాగే మంచి మెలోడియస్ సాంగ్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.

కొన్ని రోజుల క్రితం విడుదల అయిన ఈ పాట ప్రస్తుతం ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరిస్తోంది. దానితో ఈ సాంగ్ కు ప్రస్తుతం యూట్యూబ్ లో అదిరిపోయే రేంజ్ వ్యూస్ కూడా లభిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సాంగ్ యూట్యూబ్ లో 14 మిలియన్ వ్యూస్ ... 290 కే లైక్ లు లభించాయి. కాసర్ల శ్యామ్ రాసిన ఈ సాంగ్ ని రామ్ మిరియాల, ఢీ చాలా సూపర్ గా పాడారు. సినిమా విడుదల కాక ముందు లిరికల్ వీడియో తోనే అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ని తెచ్చుకుంటున్న ఈ సాంగ్ కు సినిమా విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: