బిగ్ గ్ బాస్ షో సీజన్1 నుంచి బిగ్ బాస్ షో సీజన్4 వరకు తెలుగు లో సూపర్ సక్సెస్ కాగా బిగ్ బాస్ సీజన్5 బిగ్ బాస్ సీజన్6 మాత్రం ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేదు.

అయితే బిగ్ బాస్ షో సీజన్7 నిబంధనలు మాత్రం పూర్తిస్థాయి లో మారిపోయాయని కామెంట్లు కూడా వ్యక్త మవుతున్నాయి. బిగ్ బాస్ షో రేటింగ్స్ విషయం లో నాగ్ సైతం ఎంతో ఫీలయ్యారని సమాచారం.ఈ షో సీజన్ 7కు హోస్ట్ గా వ్యవహరించడాని కి నాగ్ అస్సలు అంగీకరించలేదని తెలుస్తోంది.

నాగార్జున కు బదులు గా రానా ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం విశేషం.. మరోవైపు ఈ షోకు పని చేస్తున్న టెక్నికల్ టీమ్ మొత్తాన్ని కూడా మార్చననున్నారని సమాచారం.. రేటింగ్స్ తగ్గడాని కి కొంతమంది టెక్నికల్ టీమ్ సిబ్బంది కూడా కొంత కారణం కావడం తో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.బిగ్ బాస్ నిర్వాహకులు నాగ్ కే కాకుండా మిగతా సిబ్బంది కి కూడా షాక్ ఇవ్వడం విశేషం.

బిగ్ బాస్ షోలో మార్పులు చేస్తే మాత్రమే ఈ షో రేటింగ్స్  పుంజు కుంటాయని మరి కొందరు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రానా ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించడాని కి అంగీక రిస్తారో లేదో చూడాల్సి ఉంది. నెటిజన్లు మాత్రం రానా తప్ప ఈ షోకు హోస్ట్ విషయం లో మరో బెస్ట్ ఆప్షన్ అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం విశేషం.

రానా ప్రస్తుతం పలు క్రేజీ  సినిమా ల తో కెరీర్ పరంగా కొంత బిజీ గా ఉన్నారని మరి కొందరు కామెంట్లు కూడా చేస్తున్నారు. రానా పారితోషికం ప్రస్తుతం భారీ స్థాయి లో ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: