తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న మాస్ హీరో లలో ఒకరు అయినటు వంటి మాస్ మహారాజా రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికి తెలిసిందే. సుదీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ లో ఫరియా అబ్దుల్లా , ద్రాక్ష నాగర్కర్ , పూజిత పన్నోడా , అను ఇమ్మానుయేల్ , మేఘ ఆకాష్ కీలకమైన పాత్రలలో కనిపించనున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న న్యాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ సినిమాలో హీరో అయినటు వంటి నాని మరియు ఇతర చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ లను ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నిర్వహిస్తుంది.

ఇది ఇలా ఉంటే రవితేజ హీరోగా రూపొందిన రావణాసుర ... నాని హీరోగా రూపొందిన దసరా సినిమాలు విడుదల తేదీలు దగ్గరగా ఉండడంతో ఈ ఇద్దరు కలిసి ఒకే ఇంటర్వ్యూలో వారి వారి మూవీ ల గురించి చిట్ చాట్ చేసుకొని ఒక వీడియోను రూపొందించినట్లు తెలుస్తోంది. ఆ వీడియోని మరి కొద్ది రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇలా వీరిద్దరూ తమ తమ సినిమా ప్రమోషన్ ల జోరును ఫుల్ స్పీడ్ గా చేస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: