పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూనే ... మరో వైపు సినిమా షూటింగ్ లలో కూడా అదే జోష్ లో పాల్గొంటున్నాడు. ఇది ఇలా ఉంటే పవన్ ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగ్ లలో పాల్గొంటూ ... కొన్ని సినిమా లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే. అందులో భాగంగా పవన్ చాలా రోజుల క్రితమే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే మూవీ ని స్టార్ట్ చేశాడు.

 ఈ మూవీ లో నిది అగర్వాల్ ... పవన్ సరసన హీరోయిన్ గా కనిపించనుండగా ... ఎం ఎం కీరవాణిమూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయ్యింది. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్నారు. పవన్ కు క్రిష్ కు ఇదే మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ పై పవన్ అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయింది.

మూవీ కి సంబంధించిన కేవలం ఒకే ఒక షెడ్యూల్ షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బ్యాలెన్స్ షెడ్యూల్ కోసం పవన్ ఏప్రిల్ 5 వ తేదీ నుండి డేట్స్ ఇచ్చినట్లు కొన్ని వార్తలు బయటికి వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి పవన్ ఏప్రిల్ 5 వ తేదీ నుండి డేట్స్ ఇచ్చినట్లు ... ఈ షెడ్యూల్ తో హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. పవన్ ప్రస్తుతం వినోదయ సీతం రీమేక్ మూవీ లో కూడా నటిస్తున్నాడు. వీటితో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కి ... సుజిత్ దర్శకత్వంలో "ఓజి" మూవీ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: