ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోయిన్స్ లో పెళ్లి సందడి బ్యూటీ శ్రీ లీల ఆఫర్స్ మీద ఆఫర్స్ తో దూసుకుపోతోంది. కేవలం రెండు సినిమాలతోనే ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయింది. ఇక ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ భామ త్రివిక్రమ్ శ్రీనివాస్ - మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో శ్రీ లీల ఎలాంటి పాత్రలో నటిస్తుందనే విషయంపై ఫిలింనగర్ లో ఓ ఆసక్తికరమైన వార్త చెక్కర్లు కొడుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ బాబుకి మరదలుగా శ్రీ లీల కనిపిస్తుందట. అల్లరి మనస్తత్వం, చలాకితనం కలిగిన మరదలి పాత్రలో శ్రీ లీల కనిపించనున్నట్లు సమాచారం. అంతేకాదు మహేష్ బాబు - శ్రీ లీలా కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ఈ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలువబోతున్నట్లు చెబుతున్నారు. రొమాన్స్, ఫన్ మేలవించి ఈ సన్నివేశాలను త్రివిక్రమ్ చాలా స్పెషల్ గా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాదులో జరుగుతోంది. మహేష్ బాబు - శ్రీ లీలపై పలు కీలక సన్నివేశాలను త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు.

ఖలేజా తర్వాత సుమారు పదేళ్ల గ్యాప్ తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ కాబోతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొన్నాయి. ఒక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మొదట ఏప్రిల్ 28 వేసవి కానుకగా విడుదల చేయాలి అనుకున్నారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ గారి మరణంతో షూటింగ్ ఆలస్యమైంది. దీంతో సినిమాను ఆగస్టు కు వాయిదా వేశారు. ఆగస్టు 11న ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్ సన్నాహాలు చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అన్నట్టు శ్రీ లీల మహేష్ - త్రివిక్రమ్ సినిమాతో పాటు బాలకృష్ణ 108 అలాగే నితిన్, రామ్, వైష్ణవ తేజ్, నవీన్ పోలిశెట్టి వంటి హీరోలతో వరుస సినిమాల్లో నటిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: