అంతకుముందు సైడ్ రోల్స్ కొన్ని సినిమాల్లో విలన్ రోల్స్ వేస్తూ వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ తన టీం తో ఒకటి రెండు సినిమాలు చేసి ఓటీటీ రిలీజ్ చేసి పర్వాలేదు అనిపించుకున్నాడు. ఆ క్రేజ్ తోనే సితార బ్యానర్ లో డీజే టిల్లు సినిమా తీశాడు. ఆ సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ గా మారిందో తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత సిద్ధు క్రేజ్ కూడా పెరిగింది. టిల్లు స్క్వేర్ అంటూ ఆ సినిమాకు సీక్వెల్ కూడా మొదలు పెట్టారు.

డీజే టిల్లు పార్ట్ 2 గా వస్తున్న టిల్లు స్క్వేర్ సినిమా మొదటి సినిమా కథకు ఏమాత్రం సంబంధం ఉండదని టాక్. అయితే సినిమాలో టిల్లు మాత్రం డీజే గా కనిపిస్తాడు. ఇదిలాఉంటే ఈ సినిమాను ఆగష్టు 11న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఆ డేట్ న అసలైతే మహేష్ త్రివ్క్రం కాంబో మూవీ రావాల్సి ఉంది. అది వచ్చే ఏడాదికి వాయిదా పడింది. సంక్రాంతికి కానుకగా జనవరి 13న మహేష్ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక ఆగష్టు 11న వదిలిన డేట్ ని టిల్లు స్క్వేర్ రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే అదే డేట్ న మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ రిలీజ్ అనుకున్నారు.

చిరంజీవితో టిల్లు పోటీ అంటే చాలా కష్టం. సినిమా ఏమాత్రం తేడా వచ్చినా సరే టిల్లు స్క్వేర్ అస్సామే అవుతుంది. అయితే డీజే టిల్లు లానే టిల్లు స్క్వేర్ కూడా సూపర్ ఎంటర్టైనర్ గా ఉంటుందని సినిమా అవుట్ పుట్ బాగా వస్తుందని అంటున్నారు. ఎలాగు టిల్లు స్క్వేర్ మీద భారీ హైప్ ఉంది కాబట్టి తప్పకుండా సినిమా బాగానే వర్క్ అవుట్ అయ్యేలా ఉంది. ఇంకా టిల్లు వల్లే చిరు సినిమాకు రిస్క్ అంటున్న వారు ఉన్నారు. ఈమధ్య కాలంలో సినిమా బాగుంటే అక్కడ ఉనంది ఏ స్టార్ అన్నది చూడట్లేదు. కాబట్టి చిరుతో టిల్లు ఫైట్ ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: