తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న గ్రేట్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ హీరోగా రూపొందినటువంటి ఆర్య మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టిన సుకుమార్ మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని అద్భుతమైన క్రేజ్ ను సంపాదించు కున్నాడు.

ఆ తరువాత అనేక మూవీ లకు దర్శకత్వం వహించిన సుకుమార్ ఇప్పటి వరకు కెరియర్ లో ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే సుకుమార్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లు ఉన్నప్పటికీ కొన్ని అపజయం సాధించిన సినిమాలు కూడా ఉన్నాయి. అలా సుకుమార్ కెరియర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం సాధించిన సినిమాలలో జగడం మరియు 1 నేనొక్కడినే మూవీ లు ఉన్నాయి . ఈ రెండు మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినప్పటికీ ఆ తర్వాత మాత్రం ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి . 

జగడం మూవీ లో రామ్ పోతినేని హీరోగా నటించగా ... 1 నేనొక్కడినే మూవీ లో మహేష్ బాబు హీరో గా నటించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా సుకుమార్ భార్య అయినటువంటి తబితా సుకుమార్ మాట్లాడుతూ ... జగడం మరియు 1 నేనొక్కడినే మూవీ లను మళ్లీ విడుదల చేయాలి అని నేను సుకుమార్ కు చెప్పాను . అవి విడుదల అయినప్పుడు ప్రజలు ఎందుకు కనెక్ట్ కాలేకపోయారో తెలుసుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు కూడా అలానే ఉందా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని తాబితా సుకుమార్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: