డాన్స్ కొరియోగ్రాఫర్ గా ... నటుడు గా ... దర్శకుడి గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్న రాఘవ లారెన్స్ తాజాగా రుద్రుడు అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాలో ప్రియ భవాని శంకర్ ... లారెన్స్ సరసన హీరోయిన్ గా నటించగా ... కతిరేశన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ రుద్రన్ అనే టైటిల్ తో తమిళ్ లో రూపొందింది. ఈ సినిమాలు తెలుగు లో రుద్రుడు అనే టైటిల్ తో విడుదల చేశారు. ఈ మూవీ ని తమిళ్ మరియు తెలుగు భాషల్లో ఏప్రిల్ 14 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేశారు. ప్రస్తుతం ఈ మూవీ కి తమిళ్ మరియు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఇప్పటి వరకు 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 3 రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ మూడు రోజుల్లో నైజాం ఏరియాలో 59 లక్షల కలెక్షన్ లను వసూలు చేయగా ... సిడెడ్ లో 36 లక్షలు ,  యూ ఏ లో 27 లక్షలు , ఈస్ట్ లో 20 లక్షలు , వెస్ట్ లో 10 లక్షలు ,  గుంటూరు లో 15 లక్షలు ,  కృష్ణ లో 16 లక్షలు ,  నెల్లూరు లో 7 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా 3 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.90 కోట్ల షేర్ ... 3.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రస్తుతం కూడా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: