దసరా సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు న్యాచురల్ స్టార్ నాని. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో పక్కా ఊరమాస్ లుక్‏లో అదరగొట్టారు న్యాచురల్ స్టార్ నాని.ఇప్పటి దాకా ఓన్లీ క్లాస్ హీరో అండ్ లవర్ బాయ్ గా మాత్రమే ఇమేజ్ సంపాదించుకున్న నాని.. ఈ సినిమాతో మాస్ హీరోగా కూడా ఎంతగానో మెప్పించాడు. ఇక తొలి ప్రయత్నంలోనే బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేశాడు ఈ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటించగా.. కన్నడ హీరో దీక్షిత్ శెట్టి, సముద్రఖని ఇంకా సాయి కుమార్ కీలకపాత్రలలో నటించారు. మార్చి 30 వ తేదీన విడుదలైన ఈ సినిమా రిలీజ్ అయిన పదిరోజుల్లో దాదాపు 100 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది. సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం కూడా చాలా ఆకట్టుకుంది. యూట్యూబ్ లో ఈ మూవీ సాంగ్స్ బాగా హిట్ అయ్యి తెగ వైరలయ్యాయి. 


ఇక ఈ సినిమా చూసిన సామాన్యులే కాదు.. సినీ ప్రముఖులు కూడా చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్, రెబల్ స్టార్ ప్రభాస్ లాంటి బిగ్ హీరోస్ దసరా చిత్రయూనిట్ పై పొగడ్తల వర్షం కురిపించగా.. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆసక్తికర ట్వీట్ చేశారు.దసరా చిత్రయూనిట్ మొత్తాన్ని కూడా ఎంతగానో అభినందించారు బన్నీ.ఇక థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యి నాని కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా ఇక త్వరలోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రిమింగ్ కానున్నట్లు సమాచారం తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన అనేది రానుంది.మొత్తానికి నాని ఆశించిన విజయాన్ని అందించింది ఈ దసరా సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: