ఇక బాలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తన సినిమాని రంజాన్ కి రిలీజ్ చెయ్యకుండా  సల్మాన్ ఖాన్ కి భయపడి వదిలేస్తారు. రంజాన్ సీజన్ లో భాయ్ జాన్ కి తమ సినిమాని పోటీగా రిలీజ్ చెయ్యాలి అంటే భయపడతారు.అందుకే రంజాన్ అనగానే సల్మాన్ భాయ్  సినిమా మాత్రమే గుర్తొస్తుంది. ఎన్నో ఏళ్లుగా జరుగుతూ వస్తున్న ఈ ఆనవాయితీని పాటిస్తూ బాలీవుడ్ ఫాన్స్ అంతా ఈద్ కి భాయ్  సినిమా కోసం వెయిట్ చేస్తారు. సల్మాన్ నటించిన ఒక సినిమా రంజాన్ రోజున ఈద్ కి రిలీజ్ అవుతుంది అంటే ట్రేడ్ వర్గాల వారు బాక్సాఫీస్ రికార్డ్స్ ని కొత్తగా రాయడానికి రెడీ అవుతారు. 2010 వ సంవత్సరం నుంచి మొదలైన ఈ ట్రెండ్… దబాంగ్, బాడీ గార్డ్, ఏక్ థా టైగర్, కిక్, భజరంగి భాయ్ జాన్, సుల్తాన్, ట్యూబ్ లైట్, రేస్ 3, ‘భారత్’ సినిమా దాకా ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ కొనసాగింది. వీటిలో హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా దాదాపు నలభై కోట్ల దాకా ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాలు కూడా ఉన్నాయి అంటే ఈద్ కి భాయ్  బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఎలా సాగిందో ఒక్కసారి అర్ధం చేసుకోవచ్చు.


ఇక సల్మాన్ ఖాన్, 2023లో ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రావడం జరిగింది. కాటమరాయుడు సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు మార్నింగ్ షో నుంచే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో నార్త్ సినీ అభిమానులందరూ కూడా చాలా డిజప్పాయింట్ అయ్యారు. ఓవరాల్ గా అన్ని సెంటర్స్ లో కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా మొదటి రోజు కేవలం 15.81 కోట్లని మాత్రమే రాబట్టింది. ఇది సల్మాన్ కెరీర్ లోనే ఈద్ కి వచ్చిన సినిమాల్లో చాలా వీకెస్ట్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి. ఈ రోజు రంజాన్ పండగ కాబట్టి కలెక్షన్స్ లో కాస్త జోష్ కనిపించే ఛాన్స్ ఉంది. ఒకవేళ కలెక్షన్స్ లో గ్రోత్ కనిపిస్తే అదే ఒక వారం రోజుల పాటు మైంటైన్ చెయ్యగలిగితేనే కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా ఒడ్డున పడే ఛాన్స్ ఉంది లేదంటే సల్మాన్ భాయ్  ఖాతాలో మరో భారీ ఫ్లాప్ పడినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: