నాగ చైతన్య నటన పరంగా ప్రేక్షకులను మెప్పించి తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను అయితే సొంతం చేసుకున్నాడు.

ప్రస్తుతం నాగ చైతన్య చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'కస్టడీ'  అయితే నాగ చైతన్య వరుస ప్లాప్స్ తో రేసులో వెనుక నే ఉన్నాడు. 'థాంక్యూ' సినిమాతో స్టార్ట్ అయిన ప్లాప్స్ పరంపర ఆ తర్వాత లాల్ సింగ్ చడ్డా వరకు అయితే వచ్చింది.

దీంతో చైతన్య కస్టడీ సినిమాపై భారీ ఆశలు అయితే పెట్టుకున్నాడు. రెండు ప్లాప్స్ పడడంతో ఆచితూచి సినిమాలు చేస్తూ సెలక్టివ్ గా కథలను ఎంచుకుంటున్నాడట.. ఈ క్రమంలోనే ఈసారి తమిళ్ డైరెక్టర్ కు నాగ చైతన్య ఛాన్స్ ను ఇచ్చాడు.. నాగ చైతన్య కెరీర్ లో 22వ సినిమాగా తెరకెక్కుతున్న కస్టడీ సినిమా ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతుందట.తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.. వరుసగా రెండు ప్లాప్స్ పడిన కూడా ఈ సినిమాకు భారీగా నే బడ్జెట్ పెడుతున్నారట... ఇప్పటికే ఈ సినిమా వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అందరిని ఆకట్టు కుంటుంది. మరి తాజాగా ఈ సినిమా నుండి మరో సాంగ్  ను విడుదల చేసారు మేకర్స్.''టైం లెస్ లవ్''  అంటూ సాగుతున్న ఈ సాంగ్ బాగా ఆకట్టు కుంటుంది.. అంతేకాదు ఈ సాంగ్ మొత్తం కంప్లీట్ వింటేజ్ టచ్ లో నే కనిపిస్తుంది.. యువన్ శంకర్ రాజా ఇచ్చిన బీట్స్ ఈ సాంగ్ ను ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యేలా చేసింది. అలాగే ఈ సాంగ్  లో చైతన్య కృతి శెట్టి లుక్స్ కూడా బాగా మెస్మరైజ్ చేస్తున్నాయి.. కాగా ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజాలు సంగీతం అందిస్తున్నారు.. అలాగే ఈ సినిమా మే 12న సమ్మర్ కానుకగా విడుదల కానుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: