తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఎంట్రీ ఇచ్చే వారిలో అతి కొద్ది మంది దర్శకులు మాత్రమే దర్శకత్వం వహించిన మొట్ట మొదటి మూవీ తోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో అజయ్ భూపతి ఒకరు. ఈ దర్శకుడు కార్తికేయ హీరో గా పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా రూపొందినటు వంటి ఆర్ ఎక్స్ 100 అనే మూవీ తో దర్శకుడుగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. 

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించింది. అలాగే ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి కూడా అజయ్ భూపతి కి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఆర్ ఎక్స్ 100 మూవీ తర్వాత ఈ దర్శకుడు శర్వానంద్ ... సిద్ధార్థ్ హీరోలుగా అను ఇమ్మాన్యూయల్ ... అదితి రావు హైదరి హీరోయిన్ లుగా మహా సముద్రం అనే మూవీ ని రూపొందించాడు.  

మంచి అంచనా నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడు మంగళవారం అనే మూవీ ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఏప్రిల్ 25 వ తేదీన ఉదయం 10 గంటల 10 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ తో అజయ్ భూపతి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయం అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: