పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి కొంత కాలం తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందబోయే ఒక మూవీ లో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ దర్శకుడు మరి కొన్ని రోజుల్లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ తో రూపొందబోయే సినిమాకు నేను దర్శకత్వం వహించబోతున్నట్లు ... ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో గా నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మరి కొన్ని రోజుల్లోనే తెలియజేస్తాను అని ఈ దర్శకుడు కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటించాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్రివిక్రమ్ కథతో సుధీర్ వర్మ ... పవన్ తో చేయబోయే సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు టాలీవుడ్ యువ హీరో అయినటు వంటి పంజా వైష్ణవ్ తేజ్ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు ... వైష్ణవ్ పాత్ర ఈ మూవీ లో చాలా తక్కువ సమయమే ఉన్నప్పటికీ ... ఈ మూవీ లో చాలా కీలక పాత్రను పోషించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా సుధీర్ వర్మ ... రవితేజ హీరో గా రూపొందిన రావణాసుర మూవీ కి దర్శకత్వం వహించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయింది. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు ... ఉస్తాద్ భగత్ సింగ్ ... ఓ జి మూవీ షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. ఈ మూడు మూవీ ల షూటింగ్ అనంతరం పవన్ ... సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: