టాలీవుడ్ టాలెంటెడ్ హీరో మ్యాచో హీరో గోపీచంద్ నటిస్తోన్న చిత్రం రామబాణం. డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుంది.ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఇంతకుముందు విడుదలైన రెండు లిరికల్ పాటలకు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మరో పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటను ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న శ్రీలీల రిలీజ్ చేయడం విశేషం. నువ్వే నువ్వే అంటూ సాగుతున్న ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతో విశేషంగా ఆకట్టుకుంటుంది. రితేష్ జి రావు అద్భుతమైన గాత్రం ఇంకా శ్రీమణి సాహిత్యం అందించిన ఈ సాంగ్ ని మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసారు.హీరోయిన్ ను చూస్తూ మైమరిచిపోయి హీరో పాడే సాంగ్ ఇది. ఈ సాంగ్ వినడానికి ఎంతో వినసొంపుగా ఉంది.ఈ పాటలో చూపించిన కోల్ కత్త అందాలు ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంకా ఈ పాటకు దినేష్ కుమార్ కొరియోగ్రఫీ చేశారు.


ఈ మూవీలో గోపీచంద్ సరసన విజయవాడ తెలుగు అమ్మాయి డింపుల్ హయతి నటించగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీను నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ మే 5న ఆడియన్స్ ముందుకు రానుంది.ఈ మూవీలో గోపిచంద్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇప్పటి దాకా ఆయన నటించిన అన్ని మూవీల కంటే ఈ మూవీలో హీరో లుక్స్ కాస్త డిఫరెంట్ గా ఉండనున్నాయి. ఈ సినిమాలో ఖుష్బూ, వెన్నెల కిషోర్, అలీ, సత్య, సప్తగిరి కీలకపాత్రలోల నటిస్తున్నారు.గత కొంత కాలంగా వరుస ప్లాపులు ఎదురుకుంటున్న గోపీచంద్ కి ఈ సినిమాతో సరైన హిట్టు దక్కుతుందో లేదో చూడాలి.గోపి చంద్ చివరిగా మారుతీ డైరెక్షన్ లో వచ్చిన 'పక్కా కమర్షియల్' సినిమాతో వచ్చాడు. కానీ ఆ సినిమా ప్లాప్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: