మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయం మీద గత కొద్దిరోజులుగా ఐటి అధికారులు సోదాలు చేస్తూనే ఉన్నారు. నిన్నటి రోజున ఆ సోదాలు కాస్త ముగిసాయన్నట్లుగా తెలుస్తోంది. 5 రోజులుగా తనిఖీలు చేస్తూ ఉండగా అర్ధరాత్రి వేళ ఐటీ అధికారులు వెళ్లిపోవడం జరిగింది. ఏప్రిల్ 19వ తేదీ నుంచి ఈ సోదాలు జరగగా నిన్నటి రోజున రాత్రి ఈ సోదాలు ముగిసాయి అన్నట్లుగా తెలుస్తోంది. పుష్ప-1 పార్ట్ -2 సినిమాలు ఐటీ చెల్లింపు జీఎస్టీ వంటి వాటిపైన అధికారులు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది.



ఇంతటి భారీ బడ్జెట్ సినిమాలకు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ కు డబ్బులు ఎలా వస్తోంది ఎవరు ఇన్వెస్ట్ చేయిస్తున్నారు. వారు సక్రమంగానే పన్నులు కడుతున్నారా లేదా అనే విధంగా తనిఖీలు చేయడం జరిగింది.. ఇలా పుష్ప సినిమా వరకు వారు చేసిన సినిమాలన్నిటిని తనిఖీలు చేసినట్లుగా సమాచారం. అలాగే వీరి కార్యాలయాలలో పాటు నివాసాలలో కూడా పలు సోదాలు జరగడంతో ఎక్కడా కూడా అనుమానస్పదంగా కనిపించలేదని సమాచారం. హవాలా మార్గంలో నిధులు మళ్లించి ఆ నిధులను ప్రమోటర్లు మైత్రి మూవీస్ మేకర్స్ ద్వారా మనీ లాండరింగుకు పాల్పడుతున్నారని ఐటీ అధికారులకు సమాచారం అందిందని తెలిపారు.


మైత్రి నిర్మాణ సంస్థ ప్రమోటర్లు వివిధ దేశాలలో వ్యాపారాలు సంబంధాలు ఉన్నాయి..ఎన్నారైలు అధికారులు గుర్తించారు.. కానీ ఎలాంటి తప్పుడు లావాదేవులను గుర్తించలేదని తెలిపారు. ఐటి రైట్స్ ముగించడంతో మైత్రి మేకర్స్ కు అలాగే డైరెక్టర్ సుకుమార్ కు కూడా పెద్ద రిలీఫ్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం పుష్ప-2 సినిమా పైన పూర్తి ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. తమ తదుపరి చిత్రాలు రాబోయే ప్రాజెక్టుల గురించి వాటి ప్రమోషన్స్ గురించి పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని తెలుస్తోంది. ఇక వీరందరి ఖాతాలను తీరుల నిర్వహించిన అధికారులు సంతృప్తి చెందినట్లు సమాచారం. మైత్రి మూవీ ప్రొడక్షన్ లో ఏ రాజకీయ నాయకుడు కూడా పాల్గొనలేదని తెలియజేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: