పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా OG.యంగ్ డైరెక్టర్ సుజీత్ గతంలో రన్ రాజా రన్, సాహూ వంటి సినిమాలని తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు.అయితే ఇక్కడ మరో విషయం ఏమంటే దర్శకుడు సుజీత్ స్వయంగా పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని. దీంతో ఈ సినిమాపై అంచనాలు అనేవి మరో రేంజ్‌లో ఉన్నాయి.ఈ సినిమా ఈమధ్యనే చాలా గ్రాండ్‌గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. గ్యాంగ్‌స్టర్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. దానయ్య నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు.ఈ సినిమా మొన్నటి దాకా ముంబైలో భారీ యాక్షన్ సీన్స్ షూటింగ్ జరుపుకుంది. ఇక ఆ షెడ్యూల్ కంప్లీట్ అవ్వడంతో ఇక నెక్స్ట్ షెడ్యూల్‌ పూణేలో మొదలుకానుందని సమాచారం తెలుస్తోంది. ఈ షెడ్యూల్ ఈ మే నెల మొదటి వారంలో మొదలుకానుందని సమాచారం తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో  ప్రియాంక అరుళ్ మోహన్ పవన్ సరసన హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే..ముంబై షెడ్యూల్ ముగియడంతో టీమ్ ప్రస్తుతం తమిళనాడులోని మహాబలేశ్వర్‌లో పవన్, ప్రియాంకలపై ఓ పాటను చిత్రీకరిస్తోందని తెలుస్తోంది. ఈ పాట చీత్రిరణ ఓ మూడు రోజుల పాటు ఉండనుందట. ఆ తర్వాత టీమ్ పూణేకు మారనుంది.


ఇక మొదట ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్‌గా OG అని ప్రచారం చేసారు. అయితే ఈ టైటిల్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇక అదే టైటిల్‌ను దర్శక నిర్మాతలు రిజిష్టర్ చేశారని తెలుస్తోంది. నిర్మాత DVV దానయ్య, 5 ప్రధాన భారతీయ భాషలలో OG అనే టైటిల్‌ని రిజిష్టర్ చేశారట. దీంతో ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తోందని తెలుస్తోంది. ఇక టైటిల్ కూడా కన్ఫర్మ్ అవ్వడంతో అతి త్వరలో అధికారిక ప్రకటనరావాల్సి ఉంది.ఇక ఈ మూవీకి రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. పవన్- సుజీత్ కాంబోలో వస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా 200 కోట్ల బడ్జెట్ కేటాయించారట దానయ్య.ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ హిస్టోరియల్ సినిమా "హరిహర వీరమల్లు". ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఒక వారియర్ లుక్‌లో కనిపించనున్నారు.భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ ఇప్పటికే దాదాపు 65 శాతం  షూటింగ్ పూర్తి చేసుకుంది. సమ్మర్ కానుకగా హరి హర వీరమల్లు  మూవీని 2023 ఏప్రిల్ 29న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే రిలీజ్ వాయిదా పడింది.ఈ సినిమా దసరాకు వస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: