మెగా డాటర్ నిహారిక కు ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఈమధ్య కాలంలోనే వెబ్ సిరీస్ లతో బిజీ అవుతు ఫ్యాన్స్ కి మరింత దగ్గరవుతు వస్తుంది. ఇక నిహారిక నటించిన డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ త్వరలోనే థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇక మెగా హీరోలు కాకుండా నిహారిక కి నచ్చిన హీరో ఎవరు అని ప్రశ్న తనకి ఎదురైంది. దీంతో నిహారిక ఎన్టీఆర్ పేరు సమాధానంగా ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గ్రేట్ పర్ఫార్మర్ అంటూ ఎన్టీఆర్ పై ప్రశంస వర్షం కురిపించింది. జూనియర్ ఎన్టీఆర్ ఆల్రౌండర్ అని ఈ రీసన్ వల్లే జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొంది నిహారిక.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమా మిస్ కాకుండా చూస్తానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిహారిక చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నిహారిక ఎన్టీఆర్ గురించి మాట్లాడడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఎప్పటికైనా ఛాన్స్ వస్తుందని ఎదురు చూస్తున్నారు.ఛాన్స్ వస్తే కచ్చితంగా నటించాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాదు నిహారికకు హర్రర్ సినిమాలో అంటే చాలా భయంఅట.. అయినా కూడా  సాయితేజ్ బావ కోసం నేను ఆయన నటించిన విరూపాక్ష సినిమాని చూశాను అంటూ వెల్లడించింది.

అంతేకాదు రాబోయే రోజుల్లో నటిగా కూడా కెరియర్ను మొదలుపెడతానని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఎంతో టాలెంట్ ఉన్న మెగా డాటర్ కెరియర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తోంది. తనకి వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకు పుచ్చుకుంటూ నటిగా ఎదగాలన్న ఉద్దేశంతో కొనసాగుతోంది. అంతేకాదు రాబోయే రోజుల్లో నటిగా మరింత ఎత్తుకు ఎదుగుతుందని మెగా ఫ్యాన్స్ కామెంట్లను సైతం పెడుతున్నారు. దీంతో మెగా డాటర్ ని అభిమానించే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇక నిహారిక జూనియర్ ఎన్టీఆర్ మరియు సాయి తేజ్ ల గురించి చేసిన కామెంట్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: