టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ప్రియమణి ముఖ్యమంత్రి పాత్రలో నటించగా ... అరవింద స్వామి ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఇళయ రాజా ... యువన్ శంకర్ రాజామూవీ కి సంగీతం అందించారు. ఈ మూవీ ని తెలుగు మరియు తమిళ భాషల్లో మే 12 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త మిక్సెడ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం భారీ కలెక్షన్ లు దక్కడం లేదు. ఇప్పటి వరకు ఈ సినిమా 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను ప్రపంచ వ్యాప్తంగా పూర్తి చేసుకుంది. మరి ఈ సినిమా 4 రోజుల్లో రోజు వారిగా ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిందో తెలుసుకుందాం.

మొదటి రోజు కస్టడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 2.62 కోట్ల షేర్ ... 5.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

2 వ రోజు కస్టడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1.06 కోట్ల షేర్ ... 2.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

3 వ రోజు కస్టడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1.15 కోట్ల షేర్ ... 2.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

4 వ రోజు కస్టడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 0.54 కోట్ల షేర్ ... 1.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రాక ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 5.37 కోట్ల షేర్ ... 11.40 కోట్ల గ్రాస్ కలెక్షన్.లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: