కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ, వాటిల్లో అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ను ఏర్పరుచుకున్నారు. తన నటనా పటిమతో తెరపై ఆయన చేసే సందడి అంతా ఇంతా కాదు. కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ విక్రమ్ను అభిమానించే వారు ఎంతో మంది ఉన్నారు.

సినీ పరిశ్రమలో ఎందరో హీరోలు ఉన్నారు. వారిలో ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఎదిగిన వారు కూడా ఉన్నారు. అలాంటి అరుదైన కథానాయకుల్లో కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ఒకరు. అయితే కెరీర్ స్టార్టింగ్లో తమిళ చిత్రాలతో పాటు నేరుగా తెలుగు మూవీస్లోనూ యాక్ట్ చేశారు విక్రమ్. ‘అక్క పెత్తనం’, ‘చెల్లి కాపురం’, ‘చిరునవ్వుల వరం ఇస్తావా’, ‘బంగారు కుటుంబం’, ఆడాళ్లా మజాకా’, ‘అక్క బాగున్నావా’, ‘మెరుపు’, ‘కుర్రాళ్లా మజాకా’, ‘యూత్’ లాంటి స్ట్రయిట్ తెలుగు చిత్రాల్లో నటించారు విక్రమ్. వీటిల్లో ‘బంగారు కుటుంబం’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇందులో టాలీవుడ్ లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో యాక్ట్ చేశారు. ఈ సినిమాను మినహాయిస్తే మిగిలిన మూవీస్తో విక్రమ్కు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.

తెలుగులో విక్రమ్ నటించిన చిత్రాల్లో ఎక్కువగా శ్రీకాంత్ సతీమణి ఊహతో చేసినవే ఉన్నాయి. వీళ్ల కాంబోలో వచ్చిన ‘ఊహ’ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఫిల్మ్లో విక్రమ్ నెగెటివ్ రోల్లో నటించారు. అయితే ఈ సినిమాలో కమెడియన్ అలీ హీరో స్థాయిలో సాగే కీలక పాత్రలో యాక్ట్ చేశారు. ఈ మూవీ మొత్తం అలీ, ఊహ, విక్రమ్ మధ్య సాగుతుంది. ఈ చిత్రం తర్వాత విక్రమ్ మళ్లీ నెగెటివ్ రోల్స్లో యాక్ట్ చేయలేదు. అనంతరం పూర్తిగా కోలీవుడ్కు షిఫ్ట్ అయిన ఆయన.. ‘శివపుత్రుడు’, ‘అపరిచితుడు’ చిత్రాలతో సూపర్ స్టార్గా అవతరించారు. ఈ రెండు సినిమాలు విక్రమ్లోని మేటి నటుడ్ని అందరికీ పరిచయం చేశాయి. ఆయన యాక్టింగ్కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇటీవలే ‘పొన్నియిన్ సెల్వన్-2’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్.. అందులో అద్భుతమైన నటనతో అందరి మనసులను దోచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: