తెలుగు చిత్ర పరిశ్రమ లో ని స్వీట్ కపుల్ లో శివబాలాజీ, మధుమిత  ఒక జోడీ.కాగా పెళ్లి తర్వాత ఏడాదిన్నర పాటు గొడవలు జరిగాయని మధుమిత వెల్లడించారట.

బాబు పుట్టిన తర్వాత కూడా గొడవలు జరుగుతుండటంతో కొంతకాలం పాటు డాక్టర్ సూచనల మేరకు దూరంగా ఉన్నామని శివబాలాజీ చెప్పుకొచ్చారట.. భార్యాభర్తల మధ్య గొడవలను వాళ్లు పరిష్కరించుకుంటే బాగుంటుందని కూడా శివబాలాజీ కామెంట్లు చేశారు.

ఆ గొడవలను ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుందని శివబాలాజీ అన్నారు. విడాకులు అనేది మేమెప్పుడూ ఆప్షన్ గా అయితే అనిపించలేదని మధుమిత తెలిపారు. ఒకరిపై ఒకరికి లవ్, రెస్పెక్ట్ ఉందని మధుమిత కామెంట్లు కూడా చేశారు. మా కాంబినేషన్ లో సినిమా చేయాల ని ఉందని మంచి స్క్రిప్ట్ వస్తే చేయడానికి అభ్యంతరం లేదని శివబాలాజీ వెల్లడించడం విశేషం.. చిల్డ్రన్ కు ఇద్దరూ అటాచ్ అయ్యామని శివబాలాజీ, మధుమిత చెప్పుకొచ్చారట.

ఏం చేసినా ఆలోచించి అయితే చేయాలని పిల్లలకు చెబుతామని మధుమిత అన్నారు. ఇది లేదు అని అది లేదు అని ఫీల్ కామని మధుమిత వెల్లడించారట.. మనుషులకు ఎక్కువ గా విలువ ఇస్తున్నామని మనుషులుగా మంచిగా ఉంటున్నామని కూడా ఆమె తెలిపారు. పంచవటి కాలనీలో ఫ్లోర్  తీసుకున్నామని మంచి కారు ఉందని శివబాలాజీ వెల్లడించారు. పాత కారు బాగున్నప్పుడు కొత్త కారు ఎందుకని కూడా ఆయన తెలిపారు.

నేను మనీ ఇన్వెస్టర్ అని నా భార్య మనీ సేవర్ అని ఆమె దగ్గర ఎన్ని లక్షలు ఉన్నాయో కూడా నాకు అస్సలు తెలియదని శివబాలాజీ చెప్పుకొచ్చారు. అన్నీ అకౌంటబుల్ అని శివబాలాజీ వెల్లడించారు. నేను తనకు ఇచ్చిన డబ్బులలో ఆమె సేవ్ చేస్తుందని ఆయన కామెంట్లు చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పరిస్థితి బాగుందని శివబాలాజీ తెలిపారట.. నటుడు శివబాలాజీ, మధుమిత కలకాలం అన్యోన్యంగా జీవనం సాగించాలని అభిమానులు కూడా ఎంతగానో కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: