సినిమా హిట్టా ఫట్టా అన్నదానితో సంబంధం లేకుండా విజయ్ సినిమాలు కోట్లు కొల్లగొడతాయి. ఈ విషయాన్ని ఆ మధ్య దిల్ రాజు ఇదే విషయాన్ని చెప్పాడు. ఇదేం సినిమా రా బాబు అనుకున్న బీస్ట్ సినిమా ఏకంగా 200 పైగానే వసూళ్లను రాబట్టింది. ఇక సీరియల్ అంటూనే ముద్ర వేసుకున్న వారసుడు సినిమా సైతం 300 కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టి డిస్టిబ్యూటర్లకు సైతం షాక్ ఇచ్చింది .ఇక అలా విజయ్ నటించిన ప్రతి సినిమా సినిమాకు ఆయన మార్కెట్ పెరుగుతూనే వస్తుంది. ప్రస్తుతం ఆయన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన గ్లిమ్ప్స్  ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సెలవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయబోతున్నారట. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో మారింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ ఒక కీలక పాత్రలో పోషిస్తున్నారు అన్న విషయాన్ని గతంలోని చిత్రం బృందం చెప్పింది. ఇక ఈ సినిమాలో విజయ్ సంజయ్ దత్ తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారని తాజాగా తెలిసిన సమాచారం. గ్యాంగ్స్టర్ డ్రామా నేపథ్యంలో దొరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ తండ్రికి దూరంగా కాశ్మీర్లో ఒక చాక్లెట్ ఫ్యాక్టరీని పెట్టుకుని ప్రశాంతంగా ఆయన జీవితాన్ని గడుపుతాడట.

ఇక అదే సమయంలో లియో జాడను కనుక్కున్న విలన్స్ విజయను అంతం చేయడానికి వెళతారట. ఇక నాన్న సంజయ్  వదిలేసి విజయ్ ఎందుకు సపరేట్గా ఉంటాడన్న మెయిన్ పాయింట్ తో ఈ సినిమా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో సేమ్ ఇలాగే ఎన్నో సినిమాలు వచ్చాయి. అంతేకాదు దేవి సినిమా సైతం ఈ కథకు దగ్గరగానే ఉంది ఈ క్రమంలోనే లోకేష్ కమల్ను ఈ సినిమాలో ఏ స్థాయిలో అయితే చూపించాడో ఇందులో అంతకుమించి చూపించబోతున్నాడని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: