సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో నటించిన సినిమా లలో ఎక్కువ శాతం మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించినట్లు అయితేనే వారు ఎక్కువ కాలం పాటు సినిమా ఇండస్ట్రీ లో వరుస అవకాశాలను దక్కించుకుంటూ క్రేజీ హీరోయిన్ లుగా కెరియర్ ను కొనసాగిస్తుంటారు. అలా కాకుండా వారు నటించిన సినిమా లలో ఎక్కువ శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడితే అలాంటి వారికి అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. అలాగే కొంత కాలం లోనే వారు కనుమరుగవుతూ ఉంటారు.

కాకపోతే అతి తక్కువ మంది ముద్దు గుమ్మలు మాత్రం వరుస అపజయాలు వస్తున్నప్పటికీ వరుస క్రేజీ సినిమా లలో అవకాశాలను దర్శించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో అను ఇమాన్యుయల్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ నేచురల్ స్టార్ నాని హీరో గా రూపొందినటువంటి మజ్ను మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం ... అలాగే ఈ సినిమాలో ఈ ముద్దు గుమ్మ తన అంద చందాలతో ... నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈ నటికి వరుస క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి.

అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దు గుమ్మ తెలుగు లో అజ్ఞాతవాసి , శైలజ రెడ్డి అల్లుడు , కిట్టు ఉన్నాడు జాగ్రత్త , ఆక్సిజన్ , నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా , అల్లుడు అదుర్స్ , మహా సముద్రం , ఊర్వశివో రాక్షసివో , రావణాసుర తో పాటు పలు మూవీ లలో కూడా హీరోయిన్ గ నటించింది. ఈ ముద్దు గుమ్మ నటించిన మజ్ను మూవీ మినహాయిస్తే ఏ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ అను కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Anu