సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో కొంతమందికి చాలా కష్టం మీద అవకాశాలు వస్తుంటే... మరి కొంత మందికి మాత్రం చాలా సులువుగా... ఎలాంటి కష్టం లేకుండా సినిమా అవకాశాలు వస్తూ ఉంటాయి. అలా పెద్దగా ఎలాంటి కష్టం లేకుండా అనుకోకుండా సినిమా అవకాశాన్ని దక్కించుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను... వరుస వెబ్ సిరీస్ అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న సుబ్బరాజు ఒకరు.

ఈ నటుడు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మధ్య కాలంలో ఈ నటుడు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా సుబ్బరాజు "ఏటీఎం" అనే వెబ్ సిరీస్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ నటుడికి మొదటి సినిమా ఆఫర్ ఎలా వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు. సుబ్బరాజు కు మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చిందో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో కృష్ణవంశీ ఒకరు. ఈయన ఆఫీసులో ఒకరోజు కంప్యూటర్ పాడు అవడంతో ఎవరినైనా పిలిచి సిస్టమ్ ను బాగు చేయించండి అని చెప్పాడట. ఆ తర్వాత కంప్యూటర్ బాగు చేసే వ్యక్తి వచ్చి దానిని బాగు చేశాడట. ఆ తర్వాత సిస్టమ్ బాగు చేసిన వ్యక్తిని చూసి ఇతను సినిమాలో బాగుంటాడు. అని వెంటనే తాను రూపొందిస్తున్న ఖడ్గం మూవీలో అవకాశాన్ని ఇచ్చాడట. అలా సుబ్బరాజు కు ఖడ్గం మూవీలో ఆఫర్ వచ్చిందట. ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం ఫుల్ జోష్ లో సుబ్బరాజు తన కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: