టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య హీరోగా రూపొందిన ఛలో మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఈ మూవీ తోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటిమని నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఛలో మూవీ తో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అనేక అవకాశాలను దక్కించుకుంది. 

అందులో భాగంగా రష్మిక నటించిన సినిమాలలో ఎక్కువ శాతం మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో అతి తక్కువ కాలంలోనే రష్మిక టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థానానికి ఎదిగిపోయింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ ముద్దు గుమ్మ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప ది రైస్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మకు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ లభించింది.

ప్రస్తుతం రష్మిక "పుష్ప ది రూల్" అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే సినిమాల్లో అందచందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయని ఈ హాట్  బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా రష్మిక తన సోషల్ మీడియా అకౌంట్ లో రెడ్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: