మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీలలో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఒకటి. ఈ సినిమాకు ఆ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. వైజయంతి సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించగా ... ఇళయరాజామూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని 1990 వ సంవత్సరం భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేశారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన బ్లాక్ బస్టర్ టాక్ ను బాక్సా ఫీస్ దగ్గర తెచ్చుకొని కలెక్షన్ ల వర్షం కురిపించింది.

దానితో ఈ సినిమా అప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా కలెక్ట్ చేయని రేంజ్ లో కలక్షన్ లను వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విజయంలో ఇళయరాజా అందించిన సంగీతం ... ఆ సంగీతానికి చిరంజీవి వేసిన స్టెప్ లు కూడా అత్యంత కీలక పాత్రను పోషించాయి. ఇది ఇలా ఉంటే చిరంజీవిసినిమా లోని అన్ని పాటలకు కూడా అద్భుతమైన డాన్స్ చేశాడు. అలాగే చిరంజీవికి పోటీపడి శ్రీదేవి కూడా ఈ పాటల్లో డాన్స్ చేసింది. కాకపోతే ఈ సినిమాలోని ఒక పాట కోసం మాత్రం చిరంజీవి తన ప్రాణాలను ప్రాణంగా పెట్టాడట. ఆ పాట ఏమిటి..? అందులో చిరంజీవి తన ప్రాణాలను మనంగా ఎందుకు పెట్టాడు అనే విషయాలను తెలుసుకుందాం.

జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ లోని "దినక్కుతా" సాంగ్ ప్రేక్షకులను ఆ సమయంలో ఏ రేంజ్ లో అలరించింది మనందరికీ తెలిసిందే. ఈ సాంగ్ ను ఈ మూవీ ఆఖరి వర్కింగ్ డే రోజు షూట్ చేశారట. ఈ సాంగ్ షూటింగ్ కి అంతా సెట్ అయిన సమయంలో చిరంజీవి కి 104 డిగ్రీల జ్వరం వచ్చిందట. డాక్టర్లు ఇంత జ్వరంలో సాంగ్ షూట్ చేయకండి అని చెప్పారట. కాకపోతే అప్పటికే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడం ... ఆ రోజు తర్వాత శ్రీదేవి వేరే సినిమా షూటింగ్ కు వెళ్లాల్సి ఉండడంతో ... అంత జ్వరంలోనే చిరంజీవి డాక్టర్ లను పక్కన పెట్టుకొని ఈ సాంగ్ షూటింగ్ లో పాల్గొన్నారట. అంత జ్వరంలో కూడా చిరంజీవి... శ్రీదేవిని బీట్ చేసే రేంజ్ లో ఈ పాటలో డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: