బుల్లితెర నటి, బిగ్ బాస్ బ్యూటీ హిమజ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలు సీరియల్ లో నటించి తన నటనకు మంచి గుర్తింపు అందుకొని ఆ తర్వాత వెండితెరపై పలు సినిమాలలో నటించి తన నటనకు ఒక పేరు సంపాదించుకుంది.

ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గా కనిపిస్తుంది.ఈమె తొలిసారిగా భార్యామణి, స్వయంవరం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక బుల్లితెరపై పలు షోలలో కూడా పాల్గొని బాగా సందడి చేసింది. అంతేకాకుండా స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ 3 లో హిమజ పాల్గొని మరింత పరిచయం పెంచుకుంది. ఇక బిగ్ బాస్ తర్వాత హిమజ ఇమేజ్ మొత్తం మారింది.

కానీ అంతగా సినిమాలలో అవకాశాలు అందుకున్నట్లు కనిపించలేదు. కేవలం సోషల్లో నే యాక్టివ్ గా మారిందని చెప్పవచ్చు. అప్పుడప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో పాటు, తనకు సంబంధించిన ఫొటోస్ పంచుకుంటూ ఉంటుంది. ఇక యూ ట్యూబ్ లో తన పేరు మీద ఓ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది. ఇక అందులో తనకు సంబంధించిన వీడియోలను బాగా పంచుకుంటుంది.ఈమె పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కూడా చేసి బాగా సందడి చేసింది. అంతేకాకుండా కొన్ని బ్రాండ్ల గురించి కూడా ప్రమోషన్ చేస్తూ ఉంటుంది. ఆన్లైన్ గేమ్స్ గురించి కూడా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. వెండితెరపై ఆమెకు అవకాశాలు లేక ఇటువంటి చిన్నచిన్న ప్రమోషన్స్ చేస్తూ బాగా బిజీగా మారింది. అప్పుడప్పుడు బుల్లితెరపై కొన్ని ఈవెంట్లలో పాల్గొని సందడి చేస్తూ ఉంటుంది. ఇక ఖాళీ సమయం దొరికితే చాలు విదేశాలలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి న్యూయార్క్ ట్రిప్ కు వెళ్ళగా అక్కడ దిగిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంది. అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో పంచుకుంది. అందులో తను అక్కడ ఒక జాతికి చెందిన పెద్ద పామును మెడలో వేసుకొని కెమెరాకు ఫోజులిచ్చి కనిపించింది. కాస్త భయపడుతున్నట్లుగానే అనిపించినప్పటికీ కూడా మెల్లిగా ధైర్యం తెచ్చుకొని ఆ పామును బాగానే పట్టుకుంది. ఇక దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వటంతో.. ఆ వీడియో చూసి జనాలు హిమజ బాగానే ధైర్యం చేసి పాముతో బాగానే సరసాలు చేస్తుంది అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ఆ మధ్య ఓ సినిమాలో అవకాశం అందుకుందని తెలిసింది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా వాటికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పంచుకోవడం ద్వారా తెలుస్తుంది. మొత్తానికి సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాతో సమయాన్ని గడుపుతుంది హిమజ.

మరింత సమాచారం తెలుసుకోండి: