ఇండియన్ కూల్ కెప్టెన్ గా పేరుపొందిన మహేంద్ర సింగ్ ధోని ఇటీవలే సినీమా రంగంలోకి కూడా అడుగుపెట్టి పలు సినిమాలను తెరకెక్కించే పనిలో పడ్డారు.. ధోని ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ పేరుతో ఒక నిర్మాణ సంస్థను స్థాపించి సౌత్ లో కూడా పలు చిత్రాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. మొదటి సినిమా నే తమిళ ఇండస్ట్రీలో నిర్మిస్తున్న ధోని కోలీవుడ్ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ లవ్ టుడే సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈవాన హీరో హీరోయిన్లుగా ఒక సినిమాని చేయబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ చిత్రాన్ని LGM అనే క్యాచీ టైటిల్ పెట్టి ఆసక్తిని పెంచేలా కనిపిస్తున్నారు.


ఈ ఏడాది జనవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను కూడా మొదలు పెట్టిన చిత్ర బృందం గత నెల మే లో సినిమా షూటింగ్ను పూర్తి చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేసి ప్రమోషన్స్ కి మరింత హైలెట్ అయ్యేలా చేస్తున్నారు. టీజర్ చాలా ఎంటర్టైనింగ్ గా కనిపిస్తోందని చెప్పవచ్చు. త్వరలోనే ఈ సినిమా డేట్ మరియు అప్డేట్లను కూడా రాబోతున్నట్లు తెలియజేశారు. రమేష్ తమిళమణి దర్శకత్వంలో ఈ సినిమాని రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్లో తెరకెక్కించడం జరుగుతోంది.


ఇక ఇందులో అలనాటి హీరోయిన్ నదియా కమెడియన్ యోగి బాబు ముఖ్యమైన పాత్రల నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా రమేష్ చేస్తున్నారు. ధోని నిర్మిస్తున్న మొదటి సినిమా కావడం చేత ఇతర భాషలలో కూడా ఈ సినిమా పైన మంచి హైప్ ఏర్పడింది. అయితే ప్రస్తుతానికి తెలుగు తమిళ టీజర్ ని మాత్రమే చిత్ర బృందం విడుదల చేసింది కన్నడ మలయాళ భాషలలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తారా లేదా అనే విషయంపై ఇంకా సందిగ్ధత నెలకొంది ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి టీజర్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: