పోస్ట్ ఆఫీస్ లో పలు రకాల స్కీమ్ లు అందుబాటులో ఉన్నాయి. ఇక వీటిలో ముఖ్యంగా రికరింగ్ డిపాజిట్ పథకం కూడా ఒకటుంది. ఈ పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీం పై ప్రస్తుతం 5.8 శాతం వడ్డీ కూడా లభిస్తోంది. అయితే ఇందుకోసం ప్రతి నెలా పదిహేను వందల రూపాయల చొప్పున ఐదు సంవత్సరాలు కట్టాలి. ఇలా మీరు కట్టిన డబ్బు మొత్తం 90 వేల అవుతుంది. ఇక వడ్డీ 14,500 రూపాయలు అవుతుంది. ఇక ఐదు సంవత్సరాలు ముగిసిన తర్వాత మీరు రూ. లక్ష కు పైగా డబ్బులు తీసుకోవచ్చు.