నిస్సారమైన నేలలను సారవంతమైన నేలలుగా తీర్చిదిద్దగల శక్తి సేంద్రియ ఎరువులకు ఉంది. పూర్వ కాలంలో కేవలం ఈ సేంద్రియ ఎరువుల ద్వారా పంటలను పండిస్తూ ఉండేవారు. అంతేకాదు ఈ సేంద్రియ ఎరువుల ద్వారా పండిన పంటలు తినడం వల్ల మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉండే వాళ్లము. కానీ ఇటీవల కాలంలో అన్ని కృత్రిమ రసాయనాలు వచ్చిన తర్వాత, పొలంలో వీటి వాడకం ఎక్కువ అవుతోంది. ఈ కృత్రిమ రసాయనాలలో పండిన పంటలు తినడం వల్ల మనం కూడా శారీరకంగా,ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము. అయితే ఈ సేంద్రియ ఎరువులను ఎలా తయారు చేయాలి? దీనికి కావలసిన పెట్టుబడి ఎంత? ఎంత మొత్తంలో రాబడి వస్తుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సేంద్రియ ఎరువు లో ముఖ్యంగా ప్రధానమైనది వర్మీ కంపోస్ట్. వానపాముల వ్యర్థాన్నే వర్మీ కంపోస్ట్ అంటారు. ఈ వర్మీ కంపోస్ట్ మొక్కలు ఆరోగ్యంగా పెరగడంతోపాటు చీడ పురుగుల నుండి తట్టుకోగల శక్తిని అందిస్తుంది. అయితే ఈ వర్మీకంపోస్టు తయారు చేసుకోవడానికి ఎక్కువగా కుళ్ళిపోయిన పండ్లు, ఎండిపోయిన ఆకులు, పశువుల పేడ, గడ్డి, చెడిపోయిన కూరగాయలు వంటివి ఉపయోగించవచ్చు.
ముందుగా వర్మి కంపోస్టు తయారు చేయడానికి చేయవలసిన పద్ధతులు ఏమిటంటే, ఎత్తైన ప్రదేశంలో షెడ్లు నిర్మించుకోవాలి. ఇక అందులో కొన్ని చోట్ల తొట్టెల నిర్మాణం జరగాలి. ఒక తొట్టే..ఆరడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పు,, రెండున్నర అడుగుల ఎత్తు ఉంటే సరిపోతుంది. ఇక దీనికి మూడు వందల నుండి ఐదు వందల వానపాములు అవసరమవుతాయి.

ఆ తర్వాత వాన పాములు వదలాలి. ఇక తొట్టె లో వానపాములు వదిలిన తర్వాత, పైన పేడ చిన్న చిన్న ముద్దలుగా వేయాలి. ఇక ఆ తర్వాత ట్యాంక్ చుట్టూ చిన్న కాలువలాగా ఏర్పాటు చేసి, దానిలో నీటిని నింపాలి. ఇలా ఎందుకు చేయాలి అంటే, చీమలు వానపాములపై దాడి చేయకుండా, ఆ కాలువ అడ్డుపడుతుంది. ఆ తర్వాత తొట్టె ఎప్పుడూ తడిగా ఉండేందుకు గోనెసంచులు కప్పాలి. ఇక 30 రోజుల తర్వాత వర్మీ కంపోస్టు తయారవుతుంది. ఇక పొడిపొడిగా వానపాములు లేకుండా వానపాముల వ్యర్థాలు పైన ఏర్పడతాయి. ఇక తడిగా ఉన్న లోపలి భాగానికి వానపాములు చేరుకున్నప్పుడు, పైన ఉన్న వర్మీ కంపోస్టును పోగు చేసుకోవచ్చు . ఇలా తక్కువ ఖర్చుతో తయారైన ఈ వర్మీ కంపోస్టు ధర ఒక టన్ను 1000 నుండి 2000 రూపాయల వరకు ధర పలుకుతోంది. అందులోనూ ఇది చెడిపోదు. ఎప్పుడూ నిల్వ ఉండే వర్మీ కంపోస్ట్ అతి తక్కువ ధరలో ఎక్కువ లాభాలను ఆర్జించవచ్చు.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి