ఎవరైతే భవిష్యత్తులో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండాలని భావిస్తున్నారో.. అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం సరికొత్త స్కీమ్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక కేవలం కేంద్ర ప్రభుత్వమే కాదు.. రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు, పోస్టాఫీసులు కూడా ప్రజలకు ఆర్థిక నష్టాలను కలగకుండా ఉండేందుకు, సరికొత్త స్కీమ్లను, పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఇక అందులో భాగంగానే మోదీ సర్కార్ కూడా ప్రజల కోసం ఒక సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ పథకానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

మోదీ సర్కార్ ప్రజల కోసం ప్రవేశపెట్టిన సరికొత్త పథకం ఏమిటంటే.." ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పథకం". ఈ పథకాన్ని ప్రధాన మంత్రి మోదీ సర్కార్ పేద ప్రజలకు అండగా నిలవడం కోసం ప్రవేశపెట్టడం గమనార్హం. ఇక ఇందులో నెలకు రూ. 15 వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారు చేరడానికి అర్హులు. ఇక అంతే కాదు ఇందులో చేరడానికి వయోపరిమితి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ స్కీమ్లో చేరడం వల్ల నెలకు మూడు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి 36 వేల రూపాయలను పొందవచ్చు.


అయితే ఈ స్కీం లో చేరిన తరువాత కాలవ్యవధి పూర్తయిన  వెంటనే..అంటే దాదాపు మీకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత నెల నెలా రూ.3000 రావడం జరుగుతుంది. ఇక మీరు గనక ఈ పథకం లో చేరాలని అనుకుంటే, దగ్గర్లో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి ఈ పథకానికి సంబంధించిన వివరాలను తెలుసుకొని ఈ పథకంలో చేరవచ్చు. నెలనెలా కొంత మొత్తాన్ని మీ వయస్సు ని బట్టి చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెల 55 రూపాయలను కలుపుకొని 200  రూపాయల వరకు ఇందులో చెల్లించాల్సి ఉంటుంది. ఇక మీరు మీ వయసును బట్టి చెల్లించే మొత్తంలో మీకు వచ్చే నెల ఆదాయం ఆధారపడి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: